స.హ చట్టం అభాసుపాలు.. అడిగిన దానికి బదులు మరో సమాచారం..

by Sumithra |
స.హ చట్టం అభాసుపాలు.. అడిగిన దానికి బదులు మరో సమాచారం..
X

ప్రభుత్వ పథకాల అమలు, పనితీరులో పారదర్శకత కోసం 2005లో నాటి ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ఎన్నో అవినీతి అక్రమాలను బయటపెట్టి అక్రమార్కులను కటకటాల పాలు చేసింది. ప్రభుత్వ పథకాలను తప్పుదారి పట్టించే అధికారుల్లో గుబులు పుట్టించింది. ఎవరైనా తప్పు చేయాలంటే నాకెందుకు తలనొప్పి అనే భావన ప్రతి శాఖలో వచ్చిందంటే ఆ చట్టం ఎంత అద్బుతమైందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కాగా, ప్రస్తుతం అధికారులు అక్రమాల నుంచి తప్పించుకునేందుకు చట్టం అమలులో కొత్త పద్దతికి శ్రీకారం చుడుతున్నారు. అడిగిన సమాచారానికి బదులుగా మరో సమాచారం ఇస్తూ తమ దగ్గర ఉన్న సమాచారం ఇస్తున్నామంటూ అసలు సమాచారం ఇవ్వకుండా చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ రూరల్ మండలంలోని ఎలబోతారం గ్రామంలో ఓ సామాజిక కార్యకర్త అడిగిన సమాచారానికి బదులుగా మరో సమాచారం ఇచ్చిన ఘటన ఈ చట్టం అబాసుపాలవుతుంది అనడానికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

దిశ, కరీంనగర్ రూరల్ : ప్రభుత్వ పథకాల అమలు, పనితీరులో పారదర్శకంగా ఉండేందుకు అప్పటి ప్రభుత్వం 2005లో సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం ఎన్నో అవినీతి అక్రమాలను బయటపెట్టి అక్రమార్కులను కటకటాల పాలు చేసింది. కాగా ప్రభుత్వ పథకాలను తప్పుదారి పట్టించే అధికారుల్లో గుబులు పుట్టించింది. ఎవరైనా తప్పు చేయాలంటే నాకెందుకు తలనొప్పి అనే భావన ప్రతి శాఖలో వచ్చిందంటే ఆ చట్టం ఎంత అద్బుతమైందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఇప్పుడు అధికారులు అక్రమాల నుంచి తప్పించుకునేందుకు చట్టం అమలులో కొత్త పద్దతికి శ్రీకారం చుడుతున్నారు. అడిగిన సమాచారానికి బదులు మరో సమాచారం ఇస్తూ తమ దగ్గర ఉన్న సమాచారం ఇస్తున్నామంటూ అసలు సమాచారం ఇవ్వకుండా చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ రూరల్ మండలంలోని ఎలబోతారం గ్రామంలో ఓ సామాజిక కార్యకర్త అడిగిన సమాచారానికి బదులుగా మరో సమాచారం ఇచ్చిన ఘటన ఈ చట్టం అబాసుపాలవుతుంది అనడానికి అద్దం పడుతోంది.

చట్టాన్ని అమలు చేయలేక అవస్థలు..

సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయలేక అడిగిన సమాచారం ఇవ్వలేక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారులు చట్టానికి కొత్తబాష్యం చెబుతున్నారు. పౌరులు అడిగిన సమాచారానికి బదులు అధికారులు మరో సమాచారాన్ని ఇస్తూ మమ అనిపిస్తున్నారు. అందుకు తమ వద్ద ఇదే సమాచారం ఉందంటూ సమాచార హక్కు చట్టానికి కొత్త నిర్వచనం చెబుతున్నారు. తాజాగా కరీంనగర్ రూరల్ మండలంలోని ఎలబోతారం గ్రామపరిధిలో నిర్మాణం చేపట్టిన ఓ భావన సముదాయం సమాచారం వివరాలను అడగగా అందుకు భిన్నంగా సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అధికారులు ఇచ్చిన సమాచారంతో సదరు సామాజిక కార్యకర్త అవాక్కయ్యారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో సమాచార హక్కు చట్టం పై పౌరులు అడుగుతున్న సమాచారానికి భిన్నంగా సమాచారం ఇవ్వడం అధికారులకు అలవాటుగా మారింది. అధికారులు ఇచ్చే సమాచారంతో ఖంగుతింటున్న పౌరులు, సామాజిక కార్యకర్తలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకే అధికారులు తంటాలు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు సమాచార హక్కు చట్టం ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఒకటి అడిగితే సంబంధం లేని సమాచారం ఇచ్చారు.. సుధాకర్, సామాజిక కార్యకర్త, ఎలబోతారం

కరీంనగర్ రూరల్ మండలంలోని ఎలబోతారం గ్రామ కార్యదర్శికి ఎలబోతారం కాటన్ జిన్నింగ్ మిల్లు యాజమాన్యానికి సంబంధించి దేవునిగుట్టను ఆనుకుని ఉన్న గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఇంటి నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల వివరాల కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశాను. అందుకు గ్రామ కార్యదర్శి తనను తప్పుదోవ పట్టించి అడిగిన సమాచారానికి బదులుగా సంబంధం లేని మరో సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఇదేంటని..? నేను అడిగింది ఇది కాదు కదా అని అడిగితే మా వద్ద ఇదే సమాచారం ఉందంటూ సమాధానం చెబుతున్నాడు. అలాంటప్పుడు సమాచార హక్కు చట్టం ఎందుకో అధికారులే సమాధానం చెప్పాలి. అధికారుల అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే ఈ విధంగా చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed