- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అతను కమిట్మెంట్ అడిగాడు.. ఇక చేసేదేమి లేక అలా చేశా.. రామ్ హీరోయిన్ సంచలన కామెంట్స్
దిశ, సినిమా: ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కావ్య థాపర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వగా.. ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘ఈగల్’, ‘ఊరు పేరు భైరవకోన’, ‘డబుల్ ఇస్మార్ట్’, ‘విశ్వం’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తోంది. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో తన లైఫ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఈ భామ సంచలన కామెంట్స్ చేసింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య థాపర్ క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను మోడల్‌గా చేస్తున్న కొత్తలో ఒకతను ఆఫర్ ఇస్తానని చెప్పి ఆఫీస్‌కి ఆడిషన్‌కి పిలిచాడు. ఆ టైంలో అతను కమిట్మెంట్ ఇస్తే నాలుగు యాడ్స్‌కు ఆఫర్ ఇస్తానని అన్నాడు. అయితే తనకు మొహం మీదే నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అని చెప్పేసి బయటికి వచ్చేశాను. ఇక ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అని అప్పుడే అర్థమైంది. నేను నటిని కావాలన్నది మా నాన్న కల అందుకే ఎలాంటి కష్టం వచ్చినా సరే తాను నటిగా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ కావ్య థాపర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.