Air pollution : ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో గాలి కాలుష్యం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-16 05:31:26.0  )
Air pollution : ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో గాలి కాలుష్యం
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం(Air pollution)పెరిగిపోయింది. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంది. గాలి కాలుష్యం ప్రభావంతో ఢిల్లీ ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్య నివారణ దిశగా ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలు విధించినప్పటికి గాలి కాలుష్యం తగ్గలేదు. గాలి నాణ్యత 400కు పైగా పడిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం జీఆర్ ఏపీ -111 ఇంప్లిమెంట్ చేసింది. నిన్న ఉదయం 8 గంటల నుంచి గ్రాప్ - 111 ఆంక్షలు అమలులోకి వచ్చాయి. గతంలో ఉన్న గ్రాప్ - 1, గ్రాప్ - 2 నిబంధనలకు తోడు గ్రాప్ - 3 నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు. గాలి కాలుష్యానికి తోడు హర్యానాలో వరికుప్పలు తగలబెట్టడంతో గాలి నాణ్యత మరింత క్షిణిస్తుంది. కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో భారీ భవన నిర్మాణాలు, కూల్చివేతలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. బీఎస్ - 3కి చెందిన పెట్రోల్ వాహనాలు బీఎస్ - 4 కు చెందిన డీజిల్ వాహనాలపై నిషేధం ప్రకటించింది. ఢిల్లీ, గురుగ్రామ్, ఘజియాబాద్ ఫరీదాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్ లో బీఎస్-3, బీఎస్ -4 వాహనాలను అనుమతించడం లేదు.

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ట్రాఫిక్ దృ‌ష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలకు పనివేళల్లో మార్పులు చేశారు. అలాగే ఆరవ తరగతి నుంచి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తప్పకుండా మాస్క్ ధరించాలని సీఎం అతిశీ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 14 నుంచి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఈ మధ్య గాలి నాణ్యత మరింత క్షీణించిందని అందరూ జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సూచించారు. ఢిల్లీలో గాలి నాణ్యత క్రమంగా తగ్గడంతో వీలైనంతవరకు బయటకు వెళ్ళద్దని వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు. ఒకవేళ వెళితే శారీరకంగానే కాదు మానసికంగా కాలుష్యం ప్రభావం చూపుతుందని ఢిల్లీ ప్రజలను హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే N-95 మాస్కులు ధరించాలని సూచిస్తున్న వైద్యులు సూచిస్తున్నారు. నేటి నుంచి ప్రైమరీ నుంచి ఐదవ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని పాఠశాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు గాలి కాలుష్యం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) పై 451 గా నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed