ముగిసిన శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవ వేడుకలు..

by Sumithra |
ముగిసిన శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవ వేడుకలు..
X

దిశ, ఎల్లారెడ్డి పేట : ఎల్లారెడ్డి పేటలో గల రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం వేడుకలు శుక్రవారం రాత్రి పూట ముగిశాయి. రథోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా వస్తున్న ఆనవాయితీ మాదిరిగానే ఈసారి కూడా లడ్డూ వేలం పాట నిర్వహించారు. మొదటి లడ్డూను 50,216 రూపాయలకు ఎల్లారెడ్డిపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మకంటి భాస్కర్ కుమారుడు బొమ్మ కంటి అభిమన్యు - సుదీష్ణ దంపతులు తీసుకోగా, రెండవ లడ్డూను ముద్రకోల సంతోష్,- నీలిమ దంపతులు 15,116 రూపాయలకు, మూడవ లడ్డు, 15,116 రూపాయలకు వేలం పాట ద్వారా దక్కించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్య రథం పైకి ఎక్కి స్వామి వారిని దర్శించుకున్నారు. గత ఏడాది మొదటి లడ్డు తీసుకున్న దేశ పాండి రవి, రెండవ లడ్డు, మూడవ లడ్డు తీసుకున్న వారి డబ్బులు ఆలయకమిటీకి ముట్టినాయా ? అని గ్రామానికి చెందిన చందుపట్ల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్ లు ప్రశ్నించారు.

కాగా గతంలో ఆలయ కమిటీ చైర్మన్ గా పనిచేసిన నంది కిషన్ ఇప్పుడున్న ఆలయ కమిటీకి డబ్బులు ఇవ్వవద్దని చెప్పినాడని గ్రామ ప్రజల మధ్య చెప్పగా ఆలయ కమిటీకి, పాత కమిటీకి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం జరిగింది. దీంతో స్థానిక ఎస్ఐ రమాకాంత్ వేదిక వద్దకు వెళ్లి ఇరువర్గాలను సముదాయించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సీఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పేట ఎస్.ఐ రమాకాంత్, ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్, వీర్నపల్లి ఎస్ఐ ఎల్లగౌడ్, గంభీరావు పేట ఎస్ఐ శివ కుమార్ ల పర్యవేక్షణ లో డిస్ట్రిక్ గార్డు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దోమ్మటి నర్సయ్య, ఆలయ అర్చకులు బిట్కూరి నవీన్, గోపి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ గౌడ్, అల్లం శ్రీకాంత్, మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు రాగుల గాల్ రెడ్డి, చందుపట్ల లక్ష్మ రెడ్డి, ప్రముఖ వ్యాపారి బొమ్మ కంటి భాస్కర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed