- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. అదుపు తప్పి చెట్టును ఢీ కొన్న స్కూల్ బస్సు..
దిశ, తాడ్వాయి : కామారెడ్డి జిల్లా చిట్యాల గ్రామ శివారులో శనివారం ఉదయం పెద్ద ప్రమాదమే తప్పింది. చిట్యాల నుంచి కామారెడ్డికి వస్తున్న వివేకానంద బీ టాపర్స్ స్కూల్ బస్సు వెళ్తుండగా సోమారం రోడ్డు నుంచి ఓ కారు ఎదురుగా రావడంతో కారును తప్పించబోయి అదుపుతప్పి పక్కకు దూసుకుపోవడంతో చెట్టుకు ఆనుకోని నిలిచింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులకు భారీ ప్రమాదం తప్పింది.
రోడ్డు పక్కన ఖాళీ స్థలం వైపు చెట్టు లేకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంతో చిట్యాల గ్రామంతో పాటు పక్కగ్రామాల ప్రజలను కూడా ఉలిక్కిపడ్డారు. ఆ గ్రామం నుంచి బయలుదేరిన బస్సుకు ప్రమాదం జరిగిందని తెలియడంతో ప్రయాణం చేస్తున్న 30 మంది విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుని విద్యార్థులను చూసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లితండ్రులు ఆరోపించారు.