- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యాసంస్థలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలి.. మంత్రి దామోదర్ రాజనరసింహ..
దిశ, సంగారెడ్డి బ్యూరో : పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్ (రూరల్ వాటర్ సప్లై) ఇంజనీర్లతో మంత్రి దామోదర శనివారం రివ్యూ చేశారు. ఎస్‌ఈ రఘువీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఈఈ) విజయ లక్ష్మి, నాగభూషణం, సంపత్, పాషా, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు వెంటనే వాటర్ కనెక్షన్స్ ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలో ప్రస్తుతం ఉన్న వాటర్ కనెక్షన్స్ సరిపోవడం లేదని, ఫిర్యాదులు వస్తున్నాయని, అక్కడ విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తక్షణమే అదనపు కనెక్షన్స్ ఇవ్వాలని మంత్రి సూచించారు.
మిషన్ భగీరథ పనితీరుపై మంత్రి ఆరా తీశారు. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, వాటర్ సప్లై చేయిన్‌కు సంబంధించి రిపేర్లను, ఎప్పటికప్పుడు చేయించాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలన్నారు. ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన పెండింగ్ బిల్స్ సమస్యను అధికారులు మంత్రి దృష్టికి రావడంతో, మంత్రి ఈ విషయం పై కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి బిల్లులు వెంటనే విడుదల చేయాలని సూచించారు. మిషన్ భగీరథలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలను ప్రతి నెలా చెల్లించాలని, వారిని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు మంత్రి సూచించారు. సంబంధిత మ్యాన్ పవర్ ఏజెన్సీలతో సమావేశం నిర్వహించాలని, రెగ్యులర్‌గా వేతనాలు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలాఖరులో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల పరిశీలనకు వస్తానని అధికారులకు మంత్రి దామోదర్ రాజనరసింహ సూచించారు.