- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Lokesh: చిన్నాన్న మాకు కంటికి కనిపించే ధైర్యం.. మంత్రి నారా లోకేష్
దిశ, వెడ్ డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrababu) సొదరుడు నారా రామ్మూర్తి నాయుడు(Nara Rammurthi naidu) ఐఏజీ ఆసుపత్రి(AIG Hospital)లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. ఈ నేపధ్యంలోనే బాబాయ్ మృతి పట్ల మంత్రి నారా లోకేష్(Lokesh Nara) స్పందిస్తూ.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాబాయ్ రామ్మూర్తి నాయుడుని స్మరిస్తూ.. భావోద్వేగబరిత పోస్ట్ పెట్టారు. ఇందులో.. చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు మృతి తీవ్ర విషాదం నింపిందని, చిన్నాన్నతో చిన‌్ననాటి నా అనుబంధం కళ్ల ముందు కదిలి వచ్చిన కన్నీటితో నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. అలాగే మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి కనిపించే ధైర్యం అని, నేటి నుంచి చిరకాల జ్ఞాపకం అని చెప్పారు. ఇక చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని, అంతులేని దుఃఖంలో ఉన్న తమ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాలని కోరారు.