- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul gandhi: బైడెన్‌లా మోడీకీ మతిపోయినట్టుంది.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లాగే ప్రధాని మోడీ (Pm modi)కి మతిపోయినట్టుందని లోక్ సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సెటైర్ వేశారు. మోడీ జ్ఞాపకశక్తి కోల్పోయారని ఆరోపించారు. కాంగ్రెస్ మాట్లాడే విషయాలపై మాత్రమే మోడీ మాట్లాడుతున్నారని విమర్శించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా(Amaravathi disric)లో శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘కుల గణన నిర్వహించాలని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని లోక్‌సభలో చెప్పాను. ఇప్పుడు ప్రధాని మోడీ తన ర్యాలీల్లో ఇదే విషయాలను ప్రస్తావిస్తున్నారు. నేను రిజర్వేషన్లను వ్యతిరేకం అంటున్నాడు. అతి త్వరలోనే కులగణనకు వ్యతిరేకం అని కూడా చెబుతాడు. అమెరికా అధ్యక్షుడిలా మోడీకీ జ్ఞాపక శక్తి కోల్పోయినట్టుంది. బైడెన్ కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ అని సంబోధించారు’ అని వ్యాఖ్యానించారు. కుల గణనకు మోడీనే వ్యతిరేకమని, ఆయన దానికి అనుకూలంగా ఉంటే ఏడేళ్ల క్రితమే కుల గణన చేపట్టేవారని తెలిపారు.
కాంగ్రెస్ నేతలు ఖాళీగా ఉన్న రాజ్యాంగ పుస్తకాన్ని(Constitution book) సమావేశాల్లో ప్రదర్శిస్తు్న్నారని ఇటీవల మోడీ చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్ ఫైర్ అయ్యారు. రాజ్యాంగం కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్(Rss) కార్యకర్తలకు మాత్రమే ఖాళీగా కనపడుతోంది, కాంగ్రెస్ రాజ్యాంగానికి డీఎన్ఏ లాంటిదని అభివర్ణించారు. మోడీ, బీజేపీ రాజ్యాంగాన్ని మౌనంగా చంపేశారని ఆరోపించారు. మహారాష్ట్రలోని పేదలకు చెందిన ధారావి భూములను తమ మిత్రుడు, వ్యాపార వేత్త గౌతమ్ అదానీ(Gowtham Adhaani)కి ఇవ్వాలని మోడీ భావించారని అందుకే కోట్లాది రూపాయలు వెచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందని దీనిపై ప్రధాని దృష్టి సారించాలని సూచించారు.