- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Canada: ఎలాంటి కామెంట్స్ చేయలేను.. అర్ష్ దల్లా కేసులో కెనడా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ వేర్పాటువాది అర్ష్ దల్లా (Arsh Dalla) కేసు విషయంపై కెనడా(Canada) కీలక ప్రకటన చేసింది. శుక్రవారం పెరూలోని లిమాలో జరిగిన ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వార్షిక మంత్రివర్గ సమావేశంలో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ (Melanie Joly) మాట్లాడారు. అర్ష్ దల్లా అరెస్టు విషయంపైనా స్పందించారు. ప్రస్తుతం అర్ష్ దల్లా కేసులో విచారణ జరుగుతోందని.. కాబట్టి ఆ విషయంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని అన్నారు. అతడికి సంబంధించి ఏవైనా విచారణలు చేయాల్సి ఉంటే భారత దౌత్యవేత్తలతో చర్చలు జరుపుతామని తెలిపారు. అతడిని భారత్ కు అప్పగించే విషయంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్(EAM S Jaishankar) తో చర్చిస్తున్నట్లు తెలిపారు.
ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్
భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిన ఖలిస్థానీ వేర్పాటువాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా (Arsh Dalla)ను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబరు 27, 28న మిల్టన్ పట్టణంలో కాల్పులు జరిపిన ఘటనలో సింగ్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన కెనడా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన దల్లాపై భారత్‌లో హత్య, వేధింపులు, అపహరణ సహా పలు కేసులు ఉన్నాయి. గతేడాది జనవరిలో భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. భారీగా డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్‌లో ఇతడి పాత్ర ఉందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ కూడా తెలిపింది. అతడికి సంబంధించిన పలుకేసులను ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేస్తోంది. కాగా.. ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ కు సన్నిహితుడిగా దల్లాకు పేరుంది.