- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: ఆరు గ్యారంటీలపై పీసీసీ చీఫ్ కీలక ప్రకటన
దిశ, వెబ్ డెస్క్:కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్ గౌడ్(Telangana Congress chief Mahesh Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీలను చాలా వరకూ అమలు చేశామన్న ఆయన తెలంగాణ ప్రజలు గత పదేళ్ల కంటే 11 నెలల్లోనే మెరుగైన పాలన చూశారని తెలిపారు. వరంగల్(Warangal)లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్షమనేది లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత కేవలం ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. మూసీ ప్రక్షాళనతో భవిష్యత్తు తరాలు బాగుంటాయని చెప్పారు. మూసీ నది(Musi River) ప్రక్షాళనపై ఎలాంటి అనుమానాలు వద్దని.. అన్నింటిని నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ నెల 19న వరంగల్‌లో నిర్వహించే విజయోత్సవ సభకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపు నిచ్చారు. లక్షమంది మహిళలకు ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.