- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Karoline Leavitt: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా 27 ఏళ్ల యువతికి చాన్స్
దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలువురికి తన కేబినెట్‌లో చోటు కల్పించిన ఆయన తాజాగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ (White house Press secreatery) గా 27 ఏళ్ల యువతి కరోలిన్ లీవిట్ (Karoline Leavitt)ను నియమించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నా చారిత్రాత్మక ప్రచారంలో కరోలిన్ నేషనల్ ప్రెస్ సెక్రటరీగా అద్భుతంగా పని చేశారు. ఆమె ఇప్పుడు నాతో కలిసి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని వెల్లడించడానికి ఎంతో సంతోషిస్తున్నా’ అని తెలిపారు. ‘కరోలిన్ తెలివైన, సమర్థవంతమైన సంభాషణకర్తగా నిరూపించుకుంది. అమెరికా ప్రజలకు మా సందేశాన్ని తెలియజేయడంలో సహాయం చేస్తుందని నాకు నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.
కరోలిన్ నేపథ్యం?
కరోలిన్ లీవిట్ అమెరికాలోని న్యూ హాంప్‌షైర్( New Hyampshire) కు చెందిన యువతి. ఆమె 1997 ఆగస్టు 24న జన్మించింది. సెయింట్ అన్సెల్మ్ కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఫాక్స్ న్యూస్‌లో శిక్షణ పొందింది. ట్రంప్ మొదట అధ్యక్షుడిగా ఎన్నికైన టైంలో వైట్ హౌస్ అసెస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా పని చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన తర్వాత రిపబ్లికన్ రాజకీయ నాయకురాలు ఎలిస్ స్టెఫానిక్‌కి కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పని చేశారు. 2022లో న్యూహ్యంప్ షైర్ నుంచి యూఎస్ దిగువ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచారానికి జాతీయ ప్రెస్ సెక్రటరీ(National Press secreateey)గా కూడా కరోలిన్ వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ప్రెస్ సెక్రటరీగా నియమితులయ్యారు.
అతిపిన్న వయస్కురాలిగా రికార్డు!
వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవిని నిర్వహించే అతి పిన్న వయస్కురాలిగా కరోలిన్ రికార్డు సృష్టించనుంది. అంతకుముందు 1969లో అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ 29 ఏళ్ల రోనాల్డ్ జీగ్లర్( Ronald jeeglar)ను ప్రెస్ సెక్రటరీగా నియమించారు. ఈ రికార్డును కరోలిన్ అధిగమించనుంది. కాగా, రోజువారీ బ్రీఫింగ్‌లు నిర్వహించడం, పరిపాలన పనితీరు గురించి మీడియాకు వివరించడం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పని.