Teja Sajja: ఐఫా కాంట్రవర్సీ.. ఫైనల్లీ స్పందించిన తేజా సజ్జ.. ఏమన్నాడంటే?

by sudharani |
Teja Sajja: ఐఫా కాంట్రవర్సీ.. ఫైనల్లీ స్పందించిన తేజా సజ్జ.. ఏమన్నాడంటే?
X

దిశ, సినిమా: ఇటీవల జరిగిన ఐఫా అవార్డు (IIFA Award)ల వేడుకలో హోస్టింగ్‌లో రానా దగ్గుబాటి (Rana Daggubati), తేజా సజ్జా (Teja Sajja) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. పెద్ద హీరోల సినిమాలపైనే జోక్స్ వేసే అంతా పెద్దోడివి అయిపోయావా అంటూ నెట్టింట కొందరు విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న తేజా సజ్జ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.

‘రాబోయే కాలంలో మీరు మళ్లీ ఐఫాకు వర్క్స్ చేస్తారా’ అని యాంకర్ (anchor) ప్రశ్నించగా.. దీనిపై స్పందించిన తేజా సజ్జ ‘మంచి అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అయిన మీరు దేని గురించి అడుగుతున్నారో నాకు అర్థం అయింది. ఐఫా అనేది ఒక నేషనల్ ఫ్లాట్‌ఫామ్ (National Platform). ఆ రోజు ఏదైతే చూశారో.. ఆ క్లిప్స్ అన్ని కట్ చేసినవి. ఫుల్ వీడియో (Full Video) చూసుంటే ఎవరికి తప్పుడు ఉద్దేశం ఎవరికి వచ్చుండేది కాదు. అయిన అవి రానా నా మీద వేసిన జోక్స్. అది అందరికి అర్థం అయింది కాబట్టే ఫన్‌వే లో తీసుకున్నారు. నేను అందరూ హీరోలతో చిన్నప్పటి నుంచి వర్క్ చేశాను. వాళ్లను చూస్తూ పెరిగాను. ప్రతి ఒక్కరితో నాకు మంచి రిలేషన్ ఉంటోంది. ఎందుకు వాళ్ల గురించి తక్కవ చేసి మాట్లాడతాను. అలా మాట్లాడాలి అనే ఉద్దేశం కూడా నాకు ఎప్పుడు రాదు. ఆ వీడియో చూసి నిజంగా అపార్థం చేసుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story