- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజ్ చేయాలి’
by Aamani |
X
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను ఎలాంటి రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజ్ చేయాలని వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 29 నిర్వహించే ఫిమేల్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోటీ పరీక్షను రద్దు చేయాల్సిందిగా కోరారు. పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏఎన్ఎంలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట గురువారం సాయంత్రం నుంచి 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. కాంట్రాక్ట్ ఏఎన్ఎం ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఎలాంటి చర్చలు జరపకుండానే పరీక్షల నిర్వహించడం పట్ల ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి కాంట్రాక్టు ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని కోరారు.
Advertisement
Next Story