- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర సృష్టించిన అఫ్గానిస్తాన్.. వన్డేల్లో బిగ్గెస్ట్ విక్టరీ నమోదు
దిశ, స్పోర్ట్స్ : వన్డే క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌కు అతి పెద్ద విజయం దక్కింది. హరారే వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో జింబాబ్వేపై 232 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పరుగుల పరంగా అఫ్గాన్‌కు ఇదే అతిపెద్ద విజయం. వన్డేల్లో అతిపెద్ద విజయం రికార్డు టీమిండియా పేరిట ఉన్నది. గతేడాది శ్రీలంj 317 రన్స్ తేడాతో గెలుపొందింది. అఫ్గాన్, జింబాబ్వే మధ్య తొలి వన్డే వర్షార్పణమైన విషయం తెలిసిందే. రెండో వన్డేలో అఫ్గాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 286/6 స్కోరు చేసింది. ఓపెనర్ సెడిఖుల్లా అటల్(104) సెంచరీతో రెచ్చిపోగా.. మరో ఓపెనర్ అబ్దుల్ మాలిక్(84) కూడా సత్తాచాటాడు. అనంతరం ఛేదనకు జింబాబ్వేను అఫ్గాన్ బౌలర్లు 17.5 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూల్చారు. సికిందర్ రజా(19 నాటౌట్), సేన్ విలియమ్స్(16) మాత్రమే రెండెంకల స్కోరు చేశారు. తాజా విజయంతో అఫ్గాన్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
- Tags
- #AFG VS ZIM