KTR : అమావాస్యకి బాంబులు కొన్నాడు.. కార్తీక పౌర్ణమి దాకా పేలలేదు : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : అమావాస్యకి బాంబులు కొన్నాడు.. కార్తీక పౌర్ణమి దాకా పేలలేదు : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : తుస్సు బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) అమవాస్య దీపావళికి కొన్న బాంబులు(Bombs) కార్తీక పౌర్ణమి దాకా కూడా పేలలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో పలువురు రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్(Ed rides) జరిగి 45 రోజులైనా ఎవ్వరూ మాట్లాడట్లేదన్నారు. కాంగ్రెస్సోళ్లు, బీజేపీ వాళ్లు, ఈడీ అధికారులు.. అందరూ నిశ్శబ్ధం వహించారని, దీన్ని బట్టి ఎవరు ఎవరితో ఉన్నారో ఆలోచించుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య రహస్య అవగాహనకు ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. అదే ఈడీ కవిత ఇంటిపైన, మరోక ప్రతిపక్ష నేతపైన దాడులు చేస్తే గుండు పిన్ను దొరికిన సమాచారం బహిర్గతమవుతాయన్నారు.

ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్లు మేకలను కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మహారాష్ట్రలో చెప్తున్నారని, తెలంగాణలో మేకల మండిలో కాంగ్రెస్ బాగా కొనుగోలు చేస్తుందని, మా మేకలు తప్పిపోయి కాంగ్రెస్ మందలో తిరుగుతున్నాయని మా మేకలు పట్టుకొచ్చుకుంటామని మీరు ఇక్కడిక రండని పిలిచానని చురకలేశారు. ప్రకాష్ గౌడ్, గాంధీలకు సిగ్గుందా? ఏ పార్టీలో ఉన్నారో చెప్పే దమ్ముందా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Advertisement

Next Story