గురుకుల విద్యార్థినులు క్షేమం

by Sridhar Babu |
గురుకుల విద్యార్థినులు క్షేమం
X

దిశ, ఘట్కేసర్ : జిల్లాలోని మేడ్చల్ మైనారిటీల గురుకుల పాఠశాలలో ఫుడ్ ఇన్ఫెక్షన్ బారిన పడిన 33 మంది విద్యార్థినులు చికిత్స పొంది క్షేమంగా ఉన్నారని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి వీణ శుక్రవారం పేర్కొన్నారు. జిల్లాలో మైనారిటీ గురుకుల విద్యార్థుల అస్వస్థత శీర్షికన ప్రచురించిన కథనంపై వీణ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. గురుకుల పాఠశాలలో 450 మంది విద్యార్థినుల్లో 33 మంది విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడ్డారని, చికిత్స కోసం ఘట్కేసర్లోని ప్రభుత్వఆసుపత్రిలో చేరిన విద్యార్ధులందరికీ వైద్యాధికారి పరీక్షించి చికిత్స అందించారని, గ్యాస్ట్రిక్ సమస్యతో విద్యార్థినిలు బాధపడ్డారని తెలియజేశారు.

33 మంది విద్యార్థినులలో 24 మంది కోలుకోగా వారిని గురువారం రాత్రి హాస్టల్​కు పంపించగా మిగిలిన 9 మంది విద్యార్థినులు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. మిగిలిన విద్యార్థినులను శుక్రవారం ఉదయం నాగారంలోని మేడ్చల్ బాలికల మైనారిటీ గురుకుల పాఠశాలకు పంపించినట్టు తెలిపారు. అయితే విద్యార్థుల అస్వస్థత విషయాన్ని గోప్యంగా ఉంచిన ప్రిన్సిపాల్, అటెండర్ పై జిల్లా అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed