ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లే ఫార్ములా ఈ-రేస్ కేసు

by Kalyani |
ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లే ఫార్ములా ఈ-రేస్ కేసు
X

దిశ, సంగారెడ్డి : ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లే ఫార్ములా ఈ రేసు పై అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… కేటీఆర్ ను నిందితునిగా తప్పు చేసిన వాడిగా చూపేందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రజా జీవితంలో ఉన్నవారికి కేసులు ముఖ్యం కాదని, ప్రజలకు వాస్తవాలు తెలుపాలన్నది ముఖ్య ఉద్దేశమన్నారు. ఫార్ములా ఈ రేసులో ఎలాంటి అవినీతి జరగలేదని, ఎఫ్.ఈఓ సంస్థ చెప్పిందని, రూ.55 కోట్లు ఇచ్చినట్లు ఆ సంస్థనే ఒప్పకుందని,. సంస్థనే మాకు డబ్బులు ముట్టినై అని చెప్పిన తర్వాత ఇంకా అవినీతి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తే ఎందుకు పెట్టడం లేదని, చేతనైతే చర్చ పెట్టాలన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఇరికించడానికి కుట్ర చేస్తుందని, ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో కేటీఆర్ పై కుట్ర సాధించి ఆయనపై అక్రమ కేసులు పెట్టాలని రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ విష ప్రచారాలను మానుకోవాలని, ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో ప్రజలను డైవర్ట్ చేయాలనే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులే సీఐడీ ఆఫీసర్లు, పోలీసుల వలే ప్రవర్తిస్తున్నారని, ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లే ఫార్ములా ఈ రేసు పై అక్రమ కేసులు పెట్టి కేటీఆర్ ను నిందితునిగా తప్పు చేసిన వాడిగా చూపేందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జైపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల నర్సింలు, డాక్టర్ శ్రీహరి, విజేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జీవీ శ్రీనివాస్, మల్లాగౌడ్, ఎర్రోళ్ల చిన్న, పరశురాం నాయక్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed