- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hindus : 2024లో హిందువులపై హింస.. బంగ్లాదేశ్‌లో 2,200 కేసులు, పాకిస్తాన్‌లో 112 కేసులు
దిశ, నేషనల్ బ్యూరో : బంగ్లాదేశ్(Bangladesh), పాకిస్తాన్(Pakistan)లలో 2024 సంవత్సరంలో హిందువులు(Hindus) లక్ష్యంగా జరిగిన హింసాకాండకు సంబంధించిన కీలక గణాంకాలను భారత విదేశాంగ శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసకు సంబంధించిన దాదాపు 2,200 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. వీటిలో ఎక్కువ భాగం కేసులు షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత నమోదైనవే ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్తాన్‌లోనూ హిందువులపై దాడులకు సంబంధించిన 112 కేసులు నమోదైనట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఈమేరకు సమాచారాన్ని రాజ్యసభలో భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఆ రెండు దేశాలు కూడా అక్కడి హిందూ వర్గం ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇందుకోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపడుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లో హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రానున్న రోజుల్లోనూ గొంతెత్తుతూనే ఉంటామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. హిందువులపై హింసకు సంబంధించి బంగ్లాదేశ్‌లో 2022లో 47 కేసులు, 2023లో 302 కేసులు నమోదైనట్లు తెలిపింది. పాకిస్తాన్‌లో 2022లో 241 కేసులు, 2023లో 103 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. బంగ్లా, పాక్ మినహా ఇతర పొరుగుదేశాల్లో హిందువులపై హింసకు సంబంధించిన కేసులేవీ 2024లో నమోదు కాలేదని భారత్ స్పష్టం చేసింది.