అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

by Naveena |
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం
X

దిశ ,వేల్పూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్మూర్ ఫైర్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఫైర్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదం నివారణకు తగు జాగ్రత్తలు, సిలిండర్ వాడే విధానం,సిలిండర్ ఫైర్ అయినప్పుడు భయపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వీణ,ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యసిబ్బంది, ఆశ వర్కర్లు,ఫైర్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed