Breaking News : కోకాపేటలో బ్లాస్టింగ్ కలకలం

by M.Rajitha |
Breaking News : కోకాపేటలో బ్లాస్టింగ్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా కోకాపేట(Kokapeta)లో బ్లాస్టింగ్స్(Blastings) కలకలం రేపాయి. రియల్ భూముల్లో నిర్మిస్తున్న కొన్ని భవనాల పునాదులు తవ్వే క్రమంలో జిలెటిన్ స్టిక్స్ సహాయంతో పేలుళ్లు జరిపారు. భారీ ఎత్తున బండరాళ్ళు పైకి లేవడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. అక్కడే ఉన్న లేబర్ క్యాంప్ మీద బండరాళ్ళు పడటంతో పలువురికి గాయాలయ్యాయి. అలాగే పలు వాహనాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, అనుమతులు లేకుండా బ్లాస్టింగ్స్ జరపడంపై నిర్మాణసంస్థతో సహ పలువురిపై నార్సింగి పీఎస్‌(Narsingi PS)లో కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed