YS Sharmila : అమిత్ ‌షా వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ రగడ : వైఎస్ షర్మిల

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-20 12:22:20.0  )
YS Sharmila : అమిత్ ‌షా వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ రగడ : వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్‌(Ambedkar)పై కేంద్రమంత్రి అమిత్ ‌షా (Amit Shah)చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడాని(Divert People)కి బీజేపీ (BJP)తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అందుకు పార్లమెంటు ఆవరణలో ఆ పార్టీ సభ్యులు సృష్టించిన రగడనే నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmila )ఎక్స్ వేదికగా విమర్శి్ంచారు. బీజేపీ, ఆరెస్సెస్‌ ఎప్పుడూ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఉంటాయని, అందుకే అంబేద్కర్ జ్ఞాపకాలను చెరిపివేయాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ అమిత్ షాను రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కానీ బీజేపీ మాత్రం ఇప్పుడు కొత్త నాటకానికి తెరతీసిందని, పార్లమెంట్ లోపలికి వెళ్తున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలను బీజేపీ ఎంపీలు అడ్డుకుని పక్కకు తోయడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ తోపులాటలో మల్లికార్జున ఖర్గే కిందపడిపోయారన్నారు. సాక్షాత్తూ పార్లమెంట్ ఆవరణలోనే బీజేపీ ఎంపీలు రౌడీల్లా కర్రలు చేతబట్టి సభలోకి వెళ్లకుండా కాంగ్రెస్ ఎంపీలను అడ్డుకోవడం దారుణమన్నారు. వారిలో వారే కొట్టుకుని రాహుల్ గాంధీపై నింద మోపుతున్నారని షర్మిల ఆరోపించారు. బీజేపీ ఎంపీల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలుస్తోందని, అంబేద్కర్‌పై అమిత్ ‌షా చేసిన వ్యాఖ్యల వీడియోను డిలీట్‌ చేయాలంటూ ‘ఎక్స్‌’కు కేంద్రం నోటీసులు ఇవ్వడం చూస్తుంటే వారు తప్పు చేశారని అర్థమవుతోందన్నారు.

అంబేద్కర్‌పై బీజేపీ అసలు ఆలోచనలు.. అమిత్‌షా వ్యాఖ్యల రూపంలో బయటపడ్డాయని షర్మిల స్పష్టం చేశారు. దేశానికి రాజ్యాంగాన్ని, కోట్లాది మంది దళితులు, అణగారినవర్గాల ప్రజల జీవితాలను మార్చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్‌ను బీజేపీ అనుక్షణం అవమానిస్తోందన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కాషాయం మూకపై పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed