Manchiryala: సీఎం రేవంత్ రెడ్డికి మంచిర్యాల ప్రజల పాలాభిషేకం

by Ramesh Goud |   ( Updated:2024-12-20 12:20:41.0  )
Manchiryala: సీఎం రేవంత్ రెడ్డికి మంచిర్యాల ప్రజల పాలాభిషేకం
X

దిశ, వెబ్ డెస్క్: మంచిర్యాలను(Manchiryala) మున్సిపల్ కార్పొరేషన్(Minicipal Corporation) గా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Chief Minister Revanth Reddy) ప్రజలు పాలభిషేకం(Milk anointing) చేశారు. రాష్ట్రంలో కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయాన్ని అసెంబ్లీ(Telangana Assembly)లో మంత్రి శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ప్రకటించారు. దీంతో ఈ నిర్ణయంపై మంచిర్యాల ప్రజలు(Manchiryala People) సంబరాలు(Celebrations) చేసుకుంటున్నారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎంతో కృషి చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ నిర్ణయం పై పట్టణ ప్రజలు సీఎం, ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed