- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజమవుతుందా..? బెజ్జూరులో వింత దూడ జననం
దిశ, బెజ్జూర్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వింత సంఘటన వెలుగుచూసింది. సృష్టికి విరుద్దంగా ఓ గేదెకు వింత దూడ జన్మించింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు నాలుకలతో దూడ జన్మించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. శనివారం ఉదయం బెజ్జూరు మండల కేంద్రానికి చెందిన మేకల పర్వతాలుకు చెందిన గేదె మూడు నాలుకలతో ఉన్న వింత దూడకు జన్మిచ్చింది. దీంతో కంగారు పడిన రైతు మండల పశువైద్యాధికారి డాక్టర్ రాకేష్‌కు సమాచారం ఇచ్చాడు.
ఈ సంఘటనపై స్పందించిన డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ.. జన్యుపరమైన లోపంతోనే ఇలాంటి వింత జననాలు సంభవిస్తాయని తెలిపారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశువులు ఎదకు వచ్చినప్పుడు మందలో వదలకుండా, పశు వైద్యశాలకు తరలించాలని చెప్పారు. మందల్లో ఇతరత్రా మగ పశువులతో కలవడం వల్ల ఇలాంటి జన్యు లోపాలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ పశువైద్యశాలల్లో పశువులకు వీర్యం అందుబాటులో ఉందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కాగా, ఈ వింత దూడను చూసేందుకు మండల ప్రజలు రైతు మేకల పర్వతాలు ఇంటికి క్యూ కట్టారు. ఈ దూడను చూసిన ప్రజలు బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజమవుతుందని అభిప్రాయపడుతున్నారు.