Addanki Dayakar : కేసీఆర్ పూర్తిగా చంద్రముఖిలా మారిపోయాడు.. అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు

by Ramesh N |
Addanki Dayakar : కేసీఆర్ పూర్తిగా చంద్రముఖిలా మారిపోయాడు.. అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా చంద్రముఖిగా మారి రెండు టాస్క్‌లు పెట్టిండని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR) రాజకీయ కుట్రలు అన్ని కేటీఆర్ అమలు చేస్తున్నాడని పేర్కొన్నారు. కేసీఆర్ పామ్ హౌస్‌లో కూర్చొని చేస్తున్న రాజకీయ కుట్రలకు రూపంగా కేటీఆర్ (KTR) మారుతున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.

ఒకటి ప్రభుత్వాన్ని ఎట్లా బాధనాం చేయాలి, రెండోది కొడుకును ఎలా ఛాంపియన్ చేయాలని చూస్తుండని వెల్లడించారు. ఆయన కడుపులో మంటలకు కేటీఆర్ పొగరూపంగా కనిపిస్తుండు గమనించాలి.. అని తెలిపారు. అధికారం చేజారి ఏడాది కూడా అవ్వకముందే మళ్ళీ అధికార దాహంతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులపై జరిగిన దాడిని కూడా సమర్థించుకుంటున్నారు అంటే వీళ్ళను ఏమనాలి ? అంటూ ప్రశ్నించారు.

Next Story

Most Viewed