- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Ap News: రామగిరి ఎస్సైకు బెదిరింపులు కాల్స్.. ఎస్పీకి ఫిర్యాదు

దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్(Ramagiri SI Sudhakar Yadav)కు వైసీపీ(Ycp) నేతలు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఇటీవల మాజీ సీఎం జగన్(Former CM Jagan) రాప్తాడు పర్యటనలో కొంతమంది పోలీసుల బట్టలూడదీస్తామన్న వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి సుధాకర్ యాదవ్‌ను వైసీపీ మూకలు టార్గెట్ చేశారు. సుధాకర్ యాదవ్ కు బెదిరింపుకాల్స్ చేస్తున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. ఎస్సై కుటుంబంపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో జిల్లా ఎస్పీకి సుధాకర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో సోషల్ మీడియాలో ఐడీ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.