మరోసారి కాకరేపుతున్న రాజ్ తరుణ్ ప్రియురాలు హాట్ కామెంట్స్.. రూ.12 కోట్ల కోసమే ఇదంతా చేస్తున్నారంటూ ఫైర్

by Hamsa |   ( Updated:2025-04-17 13:10:35.0  )
మరోసారి కాకరేపుతున్న రాజ్ తరుణ్ ప్రియురాలు హాట్ కామెంట్స్.. రూ.12 కోట్ల కోసమే ఇదంతా చేస్తున్నారంటూ ఫైర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) తనను మోసం చేశాడని లావణ్య(Lavanya) అనే అమ్మాయి అప్పట్లో కేసు పెట్టడంతో ఈ వివాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనతో మూడేళ్లపాటు కలిసి ఉండటంతో పాటు ప్రెగ్నెంట్ చేసి తనను మోసం చేశాడని పలు సంచలన ఆరోపణలు చేయడంతో ఈ కేసు కోర్ట్ వరకు వెళ్లగా రాజ్ తరుణ్‌కు ఊరట లభించింది. ఇక ఈ వివాదం అక్కడితో ముగుస్తుందని అంతా అనుకున్నారు. కానీ నిత్యం లావణ్య పలు వీడియోలను విడుదల చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. తాజాగా, లావణ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘రాజ్ తరుణ్ వాల్ల తల్లిదండ్రులు నేను ఉంటున్న ఇంటి దగ్గరకు 15 మందిని తీసుకుని వచ్చారు. అప్పుడప్పుడూ చుట్టం చూపుగా వస్తుంటే వండి పెట్టేదాన్ని. ఇప్పుడు 15 మందిని తీసుకొచ్చి నాపై దాడి చేయించారు. నా ప్రైవేట్ పార్ట్స్‌ను నలిపేశారు. 15 సంవత్సరాల నుంచి నేను ఉండున్న ఇంటికి వచ్చి రాజ్ తరుణ్ అని చెప్పడం ఏంటి. ఆ 15 మంది పైనుంచి నా జుట్టు పట్టుకుని లాకొని వచ్చారు. అయితే రాజ్ వాల్ల అమ్మనాన్న మాత్రం వాళ్లను ఆపలేదు.

వాల్ల ప్లాన్ అంతా నన్ను ఇక్కడి నుంచి పంపించాలనే. కేసు కోర్టులో ఉంది. అయితే నేను వారి ఇంటికి వెళ్లినప్పుడు చంపడానికి వెళ్లా అని అన్నారు. ఇప్పుడు వాళ్లు చేయించని దాడిని ఏమంటారు. నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాళ్లు వచ్చి ఆ 15 మందిని తీసుకెళ్లారు. అతనిపై నాకు ఇంకా ప్రేమ ఉంది. మేము 16 సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్నాం పెళ్లి కూడా చేసుకున్నాం అదంతా నిజం. అయితే ఇప్పుడు నేను ఉంటున్న ఇళ్లు కోటిన్నర పెట్టి కొన్నాం. అది ఇప్పుడు 12 కోట్లు అయిందని నా ఇలా దాడి చేయిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చింది. దీంతో పాటు మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లావణ్య ఇంటి ముందు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ధర్నాకు దిగినట్లు సమాచారం. ‘‘రాజ్ తరుణ్ కష్టపడి కట్టుకున్న ఇల్లు. అయితే మొదట్లో వీరిద్దరు మూడేళ్లు రిలేషన్‌లో ఉన్నారు. పైన లావణ్య కింద రాజ్ తరుణ్ ఉంటున్నారు.

కానీ ఆ తర్వాత వాల్లు విడిపోయారు. అయితే అందరూ 7,8 ఏళ్ల నుంచి కలిసే ఉంటున్నారని అనుకుంటున్నారు. లావణ్య అలా చేస్తుందని నా కొడుకు ముందే తెలుసు. ఒకవేళ ముందే ఈ రబస బయటకు వస్తే తన కెరీర్ స్పాయిల్ అయ్యేది. అందుకే అతను టార్చర్‌ను భరించాడు. కెరీర్ పోతుందని భరిస్తూ వచ్చాడు.. కానీ ఆమె డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాక అతను బయటకు పోయాడు. అతను వేరే దగ్గర రెంట్‌కు ఉంటున్నాడు. మేమే మరో చోట ఉంటాం. అతని సినిమాలు కూడా అంతం మాత్రం కాబట్టి రాజ్‌కు భారంగా మారింది. అందుకే మా ఇంటికి మేము వచ్చి దర్నా చేస్తున్నాం. మా సామాన్లు కూడా బయటకు పడేసింది. మా ఆరోగ్యం బాలేదు.. ఈ 10 ఏళ్లు మా సొంత ఇంటి కోసం బాధ పడి అన్ని రోగాలు వచ్చాయి. మా ఇల్లును మేము సొంతం చేసుకోవాలని అనుకుంటున్నాం. కానీ గొడవలు పెట్టే ఆలోచన లేదు. రాజ్ ఏం చేయలేని పరిస్థితుల్లో లేడు. తన కెరీర్ కోసమే ఇంత జరుగుతున్నా సైలెంట్‌గా ఉన్నాడు’’ అని రాజ్ తరుణ్ తండ్రి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. అయితే రాజ్ తరుణ్ నటిస్తున్న ‘పాంచ్ మినార్’ విడుదలకు సిద్ధం అవుతుండగా.. లావణ్య ఈ కామెంట్స్ చేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.



Next Story

Most Viewed