- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జిల్లా అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం : ఎంపీ చామల

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దిశ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వవిప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎంపీ వివిధ శాఖల అభివృద్ధి పనుల సంబంధించిన పలు అంశాలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించి సమీక్షించారు.
ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు మరింతగా కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ దిశ ప్రాముఖ్యతను గుర్తించి సమావేశంలో ప్రతిపాదించిన, చర్చించిన, పరిష్కార విషయాలను ప్రతి మూడు మాసాలకు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ రహదారుల రంగంలో పనులు వేగవంతం అయ్యేలా తగిన చర్యలు చేపట్టాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలు, వాటి ఇంప్లిమెంటేషన్ వాటిలో జరుగుతున్న కార్యక్రమాల మీద అవగాహన తీసుకోవడం జరిగింది.
ఈ దిశ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న నిధులు సంబంధిత శాఖలు ఎలా ఖర్చు చేస్తున్నారు, అవి ప్రజలకు గ్రౌండింగ్ అయితున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. స్థానిక శాసనసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మాత్రమే ఎక్కువగా అవగాహన ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ విషయాలను పార్లమెంట్లో సెంట్రల్ మినిస్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. కింద ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో ఏం చేస్తే బాగుంటది ఏ పథకానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలుసుకొని ఆ పథకానికి ఎక్కువ నిధులు కేంద్రం నుండి తేవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. కేంద్ర పథకాల గురించి ప్రజలకు అవగాహన కలిగించేలా సంబంధిత అధికారులు లబ్ధిదారులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలని ఎంపీ కోరారు. ఈ సమావేశంలో జెడ్పి సీఈవో శోభారాణి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, సంబంధిత శాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.