Weight Loss: స్ట్రిక్ట్ డైట్ చేయకుండా 21 రోజుల్లో 7 కేజీల బరువు తగ్గండి.. ప్రభావవంతమైన న్యూట్రిషనిస్ట్ సలహాలు..!

by Anjali |   ( Updated:2024-11-16 09:48:19.0  )
Weight Loss: స్ట్రిక్ట్ డైట్ చేయకుండా 21 రోజుల్లో 7 కేజీల బరువు తగ్గండి.. ప్రభావవంతమైన న్యూట్రిషనిస్ట్ సలహాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు(Weight Loss) సమస్యతో బాధపడుతున్నారు. వెయిట్ ఎక్కువగా ఉండటం కారణంగా ఏ డ్రెస్ వేసుకున్నా సరిగ్గా సెట్ అవ్వదు. దీంతో చాలా మంది బరువు తగ్గడం కోసం స్ట్రిక్ట్ డైట్(Strict diet) చేస్తుంటారు. వెయిట్ లాస్ అయ్యేందుకు పోషకాహాలతో కూడిన డైట్ కూడా ఇంపార్టెంట్. తినే తిండిపై డిపెండై ఉంటుంది. తీసుకునే ఆహరంతో పాటు వ్యాయామం(exercise) కూడా చాలా ముఖ్యం. ఏ సమయంలో తింటున్నామన్నది కూడా కీలకం. అయితే తాజాగా ఓ న్యూట్రిషనిస్ట్(Nutritionist) బరువు తక్కువ రోజుల్లోనే బరువు తగ్గే ప్లాన్ చెప్పారు. కేవలం 21 రోజుల్లోనే 7 కేజీలు తగ్గుతారు. కాగా ఫాలో అవ్వాల్సినవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇంటర్మెంటెంట్ ఫాస్టింగ్, నడక..

8 గంటల వ్యవధిలోనే తినాలి. మిగిలిన పదహారు గంటల పాటు ఇంటర్మెంటెంట్ ఫాస్టింగ్(Intermittent Fasting) చేయాలి. అలాగే ప్రతిరోజూ 10 వేల అడుగులు నడవాలి. 8 గంటల నిద్ర తప్పనిసరి. 4 లీటర్ల వాటర్ తీసుకోవాలి. ఈ న్యూట్రిషనిస్ట్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. వెయిట్ లాస్ కు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలుస్తోంది. అలాగే వెయిట్ లాస్‌ అవ్వాలంటే స్ట్రిక్ట్ డైట్ అవసరం లేదు.. కంటికి సరిపడ నిద్ర, శరీరానికి కావాల్సిన వాటర్ తీసుకుంటే చాలు.

నడుము 3 ఇంచులు తగ్గింది..

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఈ న్యూట్రిషనిస్ట్ చాలా ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయ్యిందని తెలిపింది. నడుము కూడా మూడు ఇంచుల వరకు తగ్గిందని వెల్లడించింది. కేవలం 21 డేస్‌లోనే 7 కేజీల బరువు తగ్గడమే కాకుండా స్కిన్ మెరుగుపడేందుకు కూడా సహకరించిందని పేర్కొంది. డయాబెటిస్(Diabetes) కూడా అదుపులో ఉంటుందని తెలిపింది.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేయాలంటే..?

మొదటికి 16:8 ఫాలో అవ్వాలి. ఇందుకోసం రోజులో 8 గంటల వ్యవధిలోనే తినేయాలి. మిగిలిన 16 గంటల్లో ఏమీ తినొద్దు. ఈ విధంగా ఫాస్టింగ్ చేస్తే తొందరగా బరువు తగ్గుతారు. అలాగే 12:8, 11:7 కూడా ఫాలో అవ్వొచ్చు. అలాగే వారంపాటు నార్మల్ ఫుడ్.. నార్మల్‌గా తిని.. తర్వాత 2 డేస్ కంప్లీట్‌గా ఫాస్టింగ్ ఉండాలి.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో ఎట్టి పరిస్థితిల్లోనూ ఇవి తినొద్దు..

ప్రభావవంతంగా పనిచేసే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కొత్తగా చేస్తున్నవారు 14:10 చేస్తే బెటర్. కాగా ఇందుకోసం పది గంటల వ్యవధిలోనే తినాలి. 14 గంటలు ఫాస్టింగ్ చేస్తే చాలు. ఆ తర్వాత టైమ్‌ను పెంచుకుంటూ వెళ్లాలి. కానీ ఉపవాసం చేస్తున్న సమయంలో మాత్రం కొబ్బరినీళ్లు(Coconut water), పాలు(milk), టీ(tea), కాఫీలు(coffee), పండ్ల జ్యూస్‍(Fruit juice)లు తీసుకోవద్దని నీతూ గోస్వామి సూచించారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed