ఎంఎంటీఎస్ రైలులో హత్యాచార యత్నం ఘటన.. రైల్వే ఎస్పీకి ఎమ్మెల్సీ కవిత ఫోన్

by Ramesh Goud |
ఎంఎంటీఎస్ రైలులో హత్యాచార యత్నం ఘటన.. రైల్వే ఎస్పీకి ఎమ్మెల్సీ కవిత ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kalvakuntla Kavitha) రైల్వే ఎస్పీ చందన దీప్తీ (Railway SP Chandana Deepthi)కి ఫోన్ చేశారు. ఎంఎంటీఎస్ రైలు (MMTS Train)లో యువతిపై అత్యాచారయత్నం ఘటన (Rape Attempt Incident) పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత.. రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఫోన్లో మాట్లాడారు. రైలులో యువతి పై అత్యాచారయత్నం ఘటన పై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. తనను రక్షించుకునేందుకు రైలు నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీని ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధిత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ విఫలమైందని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని తాము పదేపదే చెబుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్ష జరిపాలని, మహిళల భద్రత పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేక దృష్టి సారించాలని కవిత డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed