రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. నా ఆటోగ్రాఫ్ మూవీ రీరిలీజ్ ముహూర్తం ఖరారు..

by Anjali |
రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. నా ఆటోగ్రాఫ్ మూవీ రీరిలీజ్ ముహూర్తం ఖరారు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల రీరిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్నాయి. ఇటీవలే సూపర్‌స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu)అండ్ విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Walkitlo Sirimalle Chettu) మళ్లీ విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ప్రముఖ హీరోల సూపర్ హిట్ మూవీస్ వారి బర్త్ డే సందర్భంగా సినిమాలు విడుదల చేస్తున్నారు. అప్పటికే చూసిన మూవీస్ అయినప్పటికీ కూడా కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి.

అప్పట్లో ప్లాప్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఇప్పుడు మళ్లీ విడుదలై.. భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా.. ఫీల్ గుడ్ చిత్రాలు రీరిలీజ్ చేస్తున్నారు. ఆరెంజ్(Orange), ఓయ్ (OYE), త్రి వంటి ప్రేమ కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చి జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే తాజాగా తెలుగు ప్రేక్షకులకు మరో గుడ్‌న్యూస్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో దర్శకుడు ఎస్. గోపాల్ రెడ్డి (S. Gopal Reddy) రూపొందించి నా ఆటోగ్రాఫ్ (Na Autograph) మూవీ మళ్లీ విడుదలకు సిద్ధమైంది. ఇందులో సీనియర్ హీరో రవితేజ(Ravi Teja) కథానాయకుడిగా నటించి.. మెప్పించాడు. అప్పట్లో బాక్సాఫీసు అంతగా ఆడలేదు. ప్రేక్షకుల అంచనాలు రీచ్ అవ్వలేకపోయింది.

తర్వాత టీవీల్లోకి వచ్చాక మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ, పాత జ్జాపకాలు, సాంగ్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు. అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5 వ తేదీన రీరిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త విన్న నెటిజన్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed