రాయికల్‌లో తపంచ కలకలం.. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు

by Aamani |
రాయికల్‌లో తపంచ కలకలం.. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు
X

దిశ, రాయికల్ : జగిత్యాల జిల్లా రాయికల్ లో ఇద్దరు అజ్ఞాత వ్యక్తుల దగ్గర తపంచ లభ్యం అవ్వడం కలకలం రేపింది. మండలంలోని రామోజీపేట గ్రామంలో బీహార్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడం గ్రామస్తులు గమనించారు. సదరు వ్యక్తుల కదలికలపై అనుమానం రావడంతో వారిని తనిఖీ చేయగా నాటు తపంచ తో పాటు బుల్లెట్ దొరికింది. దీంతో గ్రామస్తులు వారిని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. అయితే సదరు వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ? అసలు వారి దగ్గర తపంచ బుల్లెట్లు ఎక్కడివి అని పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Next Story