- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సినిమాలు, ఇన్‌స్టాగ్రామ్‌లా ప్రభావమే! కర్నూలు జిల్లా ఎస్సీ హాస్టల్‌లో దారుణ ఘటన వైరల్

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలు జిల్లా (Kurnool district) కోడుమూరు ఎస్సీ హాస్టల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన మాట వినలేదని 6వ తరగతి విద్యార్థులను 9వ విద్యార్థి దారుణంగా బెల్ట్‌తో చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆరో తరగతి విద్యార్థులను (SC hostel) హాస్టల్ గదిలో కింద పడేసి మరి బెల్ట్‌తో విపరీతంగా విద్యార్థి కొట్టాడు. జూనియర్ విద్యార్థులు తమను కొట్టవద్దని వేడుకున్నా కూడా 9వ విద్యార్థి విచక్షణ కోల్పోయి వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. విద్యార్థి కొట్టే సమయంలో ఓ విద్యార్థి తెలియకుండా వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 9వ విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసులకు నెటిజన్లు ఫిర్యాదు చేస్తున్నారు.
దాడి చేసిన విద్యార్థిని కూడా అదే విధంగా కొట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లకు ఈ వీడియోను నెటిజన్లు ట్యాగ్ చేశారు. అసలు ఆ హాస్టల్ వార్డెన్ ఏం చేస్తున్నాడని నెటిజన్లు ప్రశ్నించారు. సినిమాల్లో చూపించే క్రూరత్వం, ఇన్‌స్టాగ్రామ్ ప్రభావం వల్ల నేటి యువత, పిల్లలు ఇలా తయారు అవుతున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఎస్సీ హాస్టల్‌లో విదార్థులను కొట్టిన ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.