- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రాజ్యాంగ పరిరక్షణ కోసం జన చైతన్య యాత్ర.. : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి నివాసంలో గురువారం రాజ్యాంగ పరిరక్షణ కోసం జన చైతన్య పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి ధనలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల డాక్టర్ సంజీవరెడ్డి , జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ ఆధ్వర్యంలో నారాయణఖేడ్ లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, నారాయణఖేడ్ నియోజకవర్గ "జై బాపు-జై భీమ్-జై సంవిధాన్"అభియన్ ర్యాలీ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి ధనలక్ష్మి అన్నారు.
నారాయణఖేడ్ వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ యాత్ర కోసం గ్రామ పట్టణ నియోజకవర్గ ప్రతి పల్లెపల్లెన ప్రతి గడప గడపకు పాదయాత్ర ఉంటుందని, మహాత్మా గాంధీ శతాబ్ది జయంతిలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే స్వాతంత్ర సమరయోధులను అవమానిస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించేలా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవర్తిస్తుందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం అని అన్నారు.
మహనీయుల ఆశయాలను కాపాడడం తో పాటు ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా "జై బాబు-జై భీమ్-జై సంవిధాన్"అభియాన్ ర్యాలీ నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి , నారాయణఖేడ్ నియోజకవర్గ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎస్సీ సెల్,ఎస్టీ సెల్ నాయకులు,మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.