PM Modi: ఉగ్రవాదులు భయంతో బతుకుతున్నారు.. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో మోడీ వ్యాఖ్యలు

by Shamantha N |
PM Modi:  ఉగ్రవాదులు భయంతో బతుకుతున్నారు.. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో మోడీ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదులు ఇప్పుడు వారి ఇళ్లల్లోనే భయంతో బతుకుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం జరిగిన హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ఆ సమయంలో ఉగ్రవాదం సహా పలు అంశాలపై మాట్లాడారు. సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26/11 ముంబై పేలుళ్ల కథనాలను మోడీ వీక్షించారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ‘‘ భారత ప్రజలు సురక్షితంగా లేరని చెప్పేందుకు కొందరు ఉగ్రవాదాన్ని (Terrorism) ఉపయోగించేవారు. కానీ టైం మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు వాళ్ల సొంతగడ్డపైనే అభద్రతాభావంతో ఉంటున్నారు. వాళ్ల ఇళ్లలోనే భయంభయంగా బతుకుతున్నారు. ఇక, మిలిటెంట్లు మనల్ని భయపెట్టలేరు’’ అని మోడీ (Narendra Modi) అన్నారు.

ప్రతిపక్షాలపై విమర్శలు

విపక్షాల (Opposition)పై మోడీ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పాలసీలు తీసుకొచ్చాయని ప్రధాని మోడీ (PM Modi) విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయని గుర్తుచేశారు. కానీ, ఈ దేశ ప్రజలు మమ్మల్ని నమ్మి మూడోసారి అవకాశమిచ్చారని అన్నారు. భారత్ ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. తమ విధానాలతో ప్రజలను ఆశావహ దృక్పథం వైపు నడిపిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య మంత్రంతోనే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రజల కోసమే అధికంగా ఖర్చు చేయాలి, పొదుపు చేయాలని అనేది తమ విధానమని వివరించారు.

Advertisement

Next Story