Love psychos : ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా..మీ అమ్మ, నాన్నను చంపేస్తా

by Y. Venkata Narasimha Reddy |
Love psychos : ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా..మీ అమ్మ, నాన్నను చంపేస్తా
X

దిశ, వెబ్ డెస్క్ : సమాజంలో ప్రేమోన్మాదుల(Love psychos) అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వలు ఎన్ని చట్టాలు చేసినప్పటికి యువతులకు ప్రేమోన్మాదుల నుంచి రకరకాల రూపాల్లో దాడులు ఎదురవుతునే ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్ లో తను ప్రేమించిన అమ్మాయిని ఆమె తండ్రి విదేశాలకు పంపించాడన్న కోపంతో ఓ ప్రేమెన్మాది ఏయిర్ గన్ తో అమ్మాయి తండ్రిపై కాల్పులకు తెగ బడ్డాడు. ఆ సంఘటన మరువముందే నగరంలో మరో యువకుడు ప్రేమ పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన వెలుగుచూసింది. యువతిపై స్నేహంగా ఉన్న రోజుల్లో దిగిన ఫోటోలతో లైంగిక వేధింపులకు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న ఘటనపై బాధిత యువతి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

నాగార్జున సాగర్ కు చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు నన్ను ట్రాప్ చేసి, గతంలో దిగిన ఫోటోలతో అనేక సార్లు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడంతో పాటు తన వెంట పడుతూ కాలేజీ వద్ద, బస్సులో వెలుతున్న క్రమంలో దాడికి పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మాట వినకపోతే ఎయిడ్స్ ఇంజక్షన్(AIDS injection)ఇస్తానని, మా అమ్మానాన్నలను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కోంది. నన్ను చంపుతానంటున్నాడని, తల్లిదండ్రులు లేకుండా బయటకు వెళ్లలేక పోతున్నానని, చదువుకోలేక డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నానంటూ రోధించింది. తన మాదిరిగానే విజయ్ చేతిలో మరో ముగ్గురు యువతులు కూడా మోసపోయారని బాధితురాలు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed