- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ex MLA Jaipal Yadav : తిరుపతన్నకు నేను రాజకీయ నేతల నంబర్లు పంపలేదు : మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
దిశ, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case)లో నిందితుడిగా ఉన్న ఏఎస్పీ తిరుపతన్న(Tirupatanna)కు ట్యాపింగ్ కోసం నేను రాజకీయ నేతల నంబర్లు పంపలేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ (Ex MLA Jaipal Yadav)వెల్లడించారు. ఎన్నికల సమయంలో నా ఫోన్ నుంచి రెండు ఫోన్ నంబర్లు ఇచ్చానన్నదానిపై నాకు నోటీసులిచ్చి విచారణకు రమ్మంటే వచ్చి వివరణ ఇచ్చానన్నారు. తిరుపతన్న మా సామాజిక వర్గంకు సంబంధించిన వాడని, మా కుటుంబాల్లోని వివాదాల పరిష్కారానికి ఆయన చొరవ తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఇద్దరం కలిసి ఆ వివాదం పరిష్కరించామన్నారు. ఆ వివాదంలో మాట్లాడాల్సిన బంధువుల ఫోన్ నంబర్లు మాత్రమే ఇచ్చానన్నారు.
ఫోన్ ట్యాపింగ్ లో బీఆరెఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేల ప్రమేయంలో సాగుతున్న కేసులో తనకు ఎలాంటి పాత్ర లేదని, అందుకే నాకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. నేను నీతి నిజాయితీతో ఉంటానని, ఎలాంటి తప్పు చేయలేదని, మరోసారి విచారణకు రమ్మని తనను పిలవలేదని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని స్పష్టం చేశారు.