Kolkata: కోల్ కతాలో టీఎంసీ నేతపై హత్యాయత్నం

by Shamantha N |
Kolkata: కోల్ కతాలో టీఎంసీ నేతపై హత్యాయత్నం
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ(Trinamool Leader) నేత సుశాంత ఘోష్(Sushanta Ghosh) పై హత్యాయత్నం జరిగింది. అధికార టీఎంసీ నేతను టార్గెట్‌ చేసి దుండగులు చంపే ప్రయత్నం చేయగా.. ప్లాన్‌ విఫలమైంది. దీంతో, సదరు నేత.. వారికి పట్టుకోవడంతో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఈ ఘటన బెంగాల్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సుశాంత ఘోష్ కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో(Kolkata Municipal Corporation) 108 వార్డుకు కౌన్సిలర్‌గా ఉన్నాడు. సుశాంత.. శుక్రవారం సాయంత్రం తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత, ఇంటి బయటే వారందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు షూటర్లు బైక్‌పై వచ్చి సుశాంతను తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి తన జేబులో నుంచి తుపాకీ తీసి గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే, అది పనిచేయకపోవడంతో మరోసారి కాల్చేందుకు ప్రయత్నించగా.. గన్ పనిచేయలేదు. దీంతో, సుశాంత, స్థానిక టీఎంసీ నాయకులు అతడ్ని వెంటనే లేచి పట్టుకున్నారు.

బయటకొచ్చిన సంచలనాలు

కాగా.. ఎవరు పంపారని నిందితులను టీఎంసీ నేతలు ప్రశ్నించగా సంచలనాలు బయటకొచ్చాయి. తనకెవరూ డబ్బులు ఇవ్వలేదని, ఫొటో ఇచ్చి చంపమని చెప్పడం గమనార్హం. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. దీంతో, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కౌన్సిలర్‌ను చంపేందుకు బిహార్ నుంచి కిల్లర్లను రప్పించినట్టు విచారణలో తేలింది. దీని వెనుక స్థానిక ప్రత్యర్థులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, తనను చంపేందుకు ప్లాన్ చేసిన వారు ఎవరో తెలియదని కౌన్సిలర్ పేర్కొన్నారు. తాను పుష్కర కాలంగా కౌన్సిలర్‌గా ఉన్నానని, తనపై దాడి జరుగుతుందని ఊహించలేకపోయానని చెప్పుకొచ్చారు. తన సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed