Bandi Sanjay : "పత్రికొక్కటున్న పది వేల సైన్యంబు" : కేంద్ర మంత్రి బండి సంజయ్

by Y. Venkata Narasimha Reddy |
Bandi Sanjay : పత్రికొక్కటున్న పది వేల సైన్యంబు : కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : జాతీయ పత్రికా దినోత్సవం(National Press Day) పురస్కరించుకుకి కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) పత్రికా రంగానికి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అక్షరమే ఆయుధంగా ! సత్యమే సాక్ష్యంగా...!! నిజాలను నిగ్గు తేల్చి, అన్యాయాలకు అడ్డుకట్టవేసి, అక్రమాలను చక్కదిద్దే సామాజిక రక్షక తంత్రాలు, చైతన్య కారక యంత్రాలు పత్రికలంటూ కొనియాడారు.

"పత్రికొక్కటున్న పది వేల సైన్యంబు" అన్నట్లుగా నిరంతరం సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్న ఫోర్త్ ఎస్టేట్ పత్రికా రంగానికి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పలు పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Advertisement

Next Story