- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YSRCP:వైసీపీకి మరో బిగ్ షాక్.. పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు జారీ
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీకి(YCP) మరో షాక్ తగిలింది. రాష్ట్రంలో(Andhra Pradesh) ఇష్టమొచ్చినట్లు నేతలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్న వ్యవహారాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో(Social Media) అసభ్య పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం(AP Government) పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో కడప జిల్లా పులివెందులలో వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.
ఈ క్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు నోటీసులు పోలీసలు నోటీసులు అంటించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. పలు కేసులలో అనుమానితులుగా ఉన్న రాఘవ రెడ్డి, వివేక్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఇళ్లకు నోటీసులు అంటించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణకు సహకరించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చారు. కచ్చితంగా విచారణకు రావాలని లేకపోతే.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.