- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు..'
దిశ, భిక్కనూరు : ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏబీవీపీ కామారెడ్డి ఎస్ఎఫ్డీ ఇంచార్జ్ గంధం సంజయ్ అన్నారు. బాసర త్రిబుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న స్వాతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాసర ఐఐటీ ముట్టడికి వెళ్లకుండా ఎస్ఐ సాయికుమార్ నేతృత్వంలోని పోలీసులు భిక్కనూరు మండల కేంద్రంలోని ఆయన ఇంటి వద్ద ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత విద్యార్థిని కుటుంబానికి న్యాయం జరిగే వరకు, ఆ కుటుంబానికి అండగా నిలబడి పోరాటం చేస్తామన్నారు. విద్యార్థి సంఘాల నాయకుల అక్రమ అరెస్టులతో ఆందోళనలు ఆగవన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థినికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.