- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్యం విషమం.. హుటాహుటిన ఆసుపత్రికి బయల్దేరిన లోకేష్
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) సోదరుడు, హీరో నారా రోహిత్(Nara Rohit) తండ్రి రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఈ క్రమంలో తన చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ్టి కార్యక్రమాలన్నింటినీ లోకేష్ రద్దు చేసుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పయనమయ్యారు. అయితే ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని చంద్రబాబు హైదరాబాద్‌కు బయల్దేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి పై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు సైతం మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు.