- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా.. కన్నెత్తి చూడని జిల్లా అధికార యంత్రాంగం
దక్షిణ కాశీగా విరాజిల్లుతూ దినదినా అభివృద్ధి చెందుతున్న వేములవాడ పట్టణం భవన నిర్మాణ రంగంలోనూ అదే మార్క్‌ను చూపుతోంది. నిత్యం కొత్త కొత్త భవనాలు నిర్మాణమవుతూ పెద్దపెద్ద నగరాలకు దీటుగా వేములవాడ అభివృద్ధిలో దూసుకుపోతోంది. అయితే భవన నిర్మాణ రంగం ఏస్థాయిలోనైతే అభివృద్ధి చెందుతుందో అంతకు రెట్టింపు స్థాయిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండి కొడుతున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం మున్సిపల్ పరిధిలో ఏదైనా బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే ముందస్తుగా మున్సిపల్ కార్యాలయం నుంచి అనుమతులు పొందాలి. దీనికి సీడీఎంఏ వెబ్ సైట్‌లో బిల్డింగ్ ఎన్ని అంతస్తులు, నిర్మాణ విధానం, భవనం రెసిడెన్షియలా? కమర్షియలా? వంటి వివరాలను పక్కాగా నమోదు చేయాలి. అయితే కమర్షియల్ భవనాల కంటే రెసిడెన్షియల్ భవనాలకు చలానా రేటు తక్కువగా ఉండడంతో అక్రమార్కులు రెసిడెన్షియల్ పేరుతో అనుమతులు తీసుకుంటున్నారు. ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత కమర్షియల్‌గా మార్చి లీజులకు, కిరాయలకు ఇస్తుండడం గమనార్హం. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దిశ, వేములవాడ: సాక్షాత్తు పరవశివుడే కొలువై, దక్షిణ కాశీగా విరాజిల్లుతూ దినదినా అభివృద్ధి చెందుతున్న వేములవాడ పట్టణం భవనిర్మాణ రంగంలోనూ అదే మార్క్‌ను చూపిస్తోంది. నిత్యం కొత్త కొత్త భవనాలు నిర్మాణమవుతూ పెద్దపెద్ద నగరాలకు దీటుగా వేములవాడ పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోంది. అయితే భవన నిర్మాణ రంగం ఏస్థాయిలోనైతే అభివృద్ధి చెందుతుందో అంతకు రెట్టింపు స్థాయిలో అక్రమాలు పెరుగుతూ ప్రభుత్వ ఆదాయానికి పెద్దఎత్తున గండి కొడుతున్నట్లు తెలుస్తోంది.
రెసిడెన్షియల్‌కు అనుమతి.. కమర్షియల్ నిర్మాణాలు
నిబంధనల ప్రకారం మున్సిపల్ పరిధిలో ఏదైనా బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే ముందస్తుగా మున్సిపల్ కార్యాలయం నుంచి అనుమతులు పొందాలి. దీనికి సీడీఎంఏ వెబ్ సైట్‌లో బిల్డింగ్ ఎన్ని అంతస్తులు, నిర్మాణ విధానం, భవనం రెసిడెన్షియలా? కమర్షియలా? వంటి వివరాలను పక్కాగా నమోదు చేయాలి. అనంతరం అధికారులు ఈ దరఖాస్తును పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే అనుమతి ఇస్తారు. దీనికి గాను ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం చలానా కట్టాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ జరుగుతోంది. కమర్షియల్ భవనాల కంటే రెసిడెన్షియల్ భవనాలకు చలానా రేట్ తక్కువగా ఉంటుంది. దీంతో ఇక ఇదే అదునుగా భావిస్తున్న అక్రమార్కులు రెసిడెన్షియల్ పేరుతో అనుమతులు తీసుకొని నిర్మాణం పూర్తయిన తర్వాత కమర్షియల్‌గా మార్చి లీజులకు, కిరాయలకు ఇస్తున్నారు.
పెరుగుతున్న అక్రమ కట్టడాలు..
వేములవాడ పట్టణం ఎలాగైతే రోజురోజుకూ అభివృద్ధి చెందుతుందో అదేస్థాయిలో భవనాల నిర్మాణం పెరుగుతోంది. దీంతో అధికారుల కళ్లుగప్పి అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారు. అనుమతులు లేకున్నా 2,3 అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు.
అనుమతులు లేని భవనాల్లో వ్యాపారాలు..
మరోవైపు నామమాత్రపు అనుమతులతో నిర్మించిన భవనాల్లో వ్యాపారాలు సైతం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అసలే అనుమతులు లేని భవనాలు, అందులోనూ ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారులు నిర్వహిస్తుండడం అక్రమార్కుల ఆగడాలను వేలెత్తి చూపుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం..
టెంపుల్ సిటీగా పేరుగాంచిన వేములవాడ పట్టణంలో ఇంత పెద్దఎత్తున అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నా మున్సిపల్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు ఆన్ లైన్‌లో అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్పితే నిర్మాణాలపై నిఘా పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు భవనాల నిర్మాణాలను పర్యవేక్షణ చేసి అక్రమ భవనాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం వారు కనీసం ఆపే ప్రయత్నం చేయకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
అక్రమార్కుల ఆగడాలు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి రూ. కోట్లలో గండి పడుతుందని అధికారిక లెక్కలే తెలుపుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది.
కన్నెత్తి చూడని జిల్లా యంత్రాంగం..
రూ.కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాల్సిన జిల్లా యంత్రాంగం అసలు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో భారీ నష్టం వాటిల్లుతుందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వేములవాడలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా యంత్రాంగం ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు.
తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం..
పట్టణంలో ఇప్పటికే అక్రమంగా నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ఆయా భవనాలను తనిఖీ చేసి అనుమతులు లేని భవనాలను కూల్చి వేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన యజమానులపై చట్టప్రరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తెలిపారు.