బ్రేకింగ్: సెస్ ఎన్నికల్లో BJP బోణీ..

by Satheesh |   ( Updated:2022-12-26 14:02:39.0  )
బ్రేకింగ్: సెస్ ఎన్నికల్లో BJP బోణీ..
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్నసిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో బీజేపీ పార్టీ బోణి కొట్టింది. వేములవాడ రూరల్ సెస్ డైరెక్టర్‌గా జక్కుల తిరుపతి సమీప బీఆర్ఎస్ అభ్యర్థి దేవరాజుపై 7 ఓట్ల తేడాతో గెలుపొందాడు. దీంతో వేములవాడ పట్టణంలో బీజేపీ సంబరాలు చేస్తోంది. ఈ డైరెక్టర్ స్థానం వివాదస్పదం అయ్యాక.. ఎన్నికల అధికారులు ఫలితం రిజర్వ్‌లో ఉంచి.. పున:పరిశీలించి జక్కుల తిరుపతిని విజేతగా ప్రకటించారు. దీంతో 15 డైరెక్టర్ స్థానాలకు గాను బీజేపీ ఒక చోట బోణీ కొట్టింది.

Advertisement

Next Story