- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీజనల్ వ్యాధుల పేషంట్లకు మెరుగైన వైద్యం అందించాలి
దిశ, కోరుట్ల/ మెట్ పల్లి : జగిత్యాల జిల్లా కోరుట్ల సీహెచ్‌సీని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తనిఖీ చేశారు. ఓపీ, ఐపీ సేవలు, ల్యాబ్ రికార్డ్స్, మెడికల్ ఫార్మసీని పరిశీలించారు. ఆసుపత్రిలో స్టాక్ పొజిషన్, సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ ,చికెన్ గునియా, ప్రసూతి సేవలను పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా కల్పించాలని సూచించారు. రోజుకు ఎన్ని ఓపీలను చూస్తున్నారు, ఆసుపత్రిలో పేషెంట్లకు శుభ్రమైన తాగునీరు ,
ఆహారం అందిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. ప్రస్తుత గర్భిణులకు నార్మల్ డెలివరీలు అయ్యేవిధంగా ప్రోత్సహించాలని కోరారు. పాముకాటు, కుక్క కాటు మందులు ఉన్నాయా లేదా అని తెలుసుకున్నారు. అలాగే జిల్లాలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో పాముకాటు, కుక్క కాటు మందులు ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఏంహెచ్ఓ ని ఆదేశించారు.
మెట్ పల్లి మండలం జగ్గసాగర్లో...
అనంతరం మెట్ పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామం లో గత కొద్ది రోజులుగా విష జ్వరాలు ప్రబలడంతో హెల్త్ క్యాంప్ నిర్వహించగా జగ్గసాగర్ క్యాంపును సందర్శించి పరిసరాలను పరిశీలించి శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తున్నారా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఏంహెచ్ఓ, ఆయా ఆసుపత్రి డాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.