- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
sc corporation ex chairman : 16 మంది కలిసి 16 పైసలు కూడా తీసుకురాకపోవడం సిగ్గుచేటు..
దిశ, హుజురాబాద్ రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని, బీజేపీ, కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంపీలు 16 మంది కనీసం 16 పైసలు కూడా తెలంగాణకు తీసుకురాకపోవడం సిగ్గుచేటని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా గురువారం బండ శ్రీనివాస్ తన కార్యాలయంలో మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడకుండా తెలంగాణకు రావలసిన నిధులన్నిటిని వచ్చేదాకా పోరాటం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎంపీలు ఏ మొహం పెట్టుకొని తిరుగుతారో చెప్పాలన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ముఖ్యమంత్రితో కలిసి ఎంపీలంతా ఏకమై తమ రాష్ట్రానికి 15 వేల కోట్లు నిధులు తెచ్చుకున్నారని, అలాగే నిధులు రాని పంజాబ్ ఎంపీలు సైతం పార్లమెంట్ లో తమ నిరసన వ్యక్తం చేశారని అన్నారు.
తెలంగాణకు ఇంత అన్యాయం జరిగినా 16 మంది ఎంపీలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగిందని ఇప్పుడు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి వరకు నరేంద్ర మోడీని బడే భాయ్ అని చెప్పుకొచ్చారని అన్నారు. ప్రధానమంత్రిని అంతలా పొగిడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్ కేటాయింపు పై ఎందుకు నిలదీయడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ తన మంత్రులు, ఎంపీలతో కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టాలని ఆ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మద్దతు తెలుపుతుందని అన్నారు. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని అన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేశామంటూ చంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లక్ష రుణమాఫీ మాత్రమే చేసిందని, అదికూడా పూర్తిస్థాయిలో చేయలేదని, చాలామంది రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకర్ల చుట్టూ రోజు తిరుగుతున్నారని అన్నారు. వివిధ కారణాలు చూపి రైతు రుణమాఫీ ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారని అన్నారు. రైతులు రుణమాఫీ పై అధికారులను నిలదీస్తే తమకు పూర్తిస్థాయిలో గైడ్లైన్స్ రాలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.