- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదల సంక్షేమం కోసం కృషి
దిశ ,బిచ్కుంద : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. సోమవారం బిచ్కుంద వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ముఖ్యమంత్రి సహాయనిధి కింద పేదలకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్త ఖర్చుల కోసం ఆదుకోవడం జరుగుతుందన్నారు. పూర్తి పారదర్శకతతో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని, ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసానిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగాధర్,వెంకట్ రెడ్డి,పిసిసి డెలిగేట్ విఠల్ రెడ్డి, నాగనాథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.