కామారెడ్డి మాస్టర్ ప్లాన్ : విలీన గ్రామాల సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ : విలీన గ్రామాల సంచలన నిర్ణయం
X

దిశ,కామారెడ్డి: మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని గత కొద్ది నెలలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో విలీన గ్రామాల పరిధిలోని కౌన్సిలర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసి రైతులకు అండగా నిలవాలని గురువారం లింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 11వ తేదీకి మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాల గడువు ముగియడంతో 12వ తేదీన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకొని మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని 49 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్ పర్సన్‌కు రైతులు వినతి పత్రం సమర్పించారు.

అయితే వారి నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో విలీన గ్రామాలకు చెందిన1 వ వార్డు గడ్డమిధి రాణీ, 2 వ వార్డు సుతారి రవి, 6వ వార్డు ఆకుల రూప, 9వ వార్డు పడిగే సుగుణ, 10 వ వార్డు ఉర్ధోడ వనిత, 11 వ వార్డు కాసర్ల శ్రీనివాస్, 12 వ వార్డు కాసర్ల గోదావరి, 13 వ వార్డు జే శంకర్ రావు, 35 వ వార్డు పోలీస్ క్రిష్ణాజీ రావు‌లు ఈనెల 20 లోగా పదవులకు రాజీనామా చేసి బాధిత రైతులకు అండగా నిలవాలని తీర్మానం చేశారు. ఒక వేళ కౌన్సిలర్లు రైతుల పక్షాన రాజీనామా చేయకుంటే వారి ఇళ్లను సైతం ముట్టడించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈనెల 15న సంక్రాంతి సందర్భంగా రోడ్లపై ముగ్గులు వేసి నిరసన తెలిపాలని తీర్మానించారు. 17న పాత రాజంపేట గ్రామంలో భవిష్యత్ కార్యాచరణపై రైతు ఐక్యవేదిక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed