- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రైవేటు సంస్థాధిపతులపై కమలం ప్రేమ..! ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై కసరత్తు
దిశ, తెలంగాణ బ్యూరో: భవిష్యత్తులో రాబోయే ఎన్నికలపై కమలం పార్టీ సిద్ధమవుతోంది. త్వరలో టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై బీజేపీ చేపట్టిన కసరత్తు ముగిసినట్టు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో ప్రైవేట్ సంస్థాధిపతుల వైపే పార్టీ మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతికి చాన్స్ ఇవ్వాలని చూస్తోంది.
ఈ మేరకు పార్టీకి సదరు బిగ్ షాట్ పేరునే నేతలు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేట్ విద్యాసంస్థల అధిపతి అయిన ఏవీఎన్ రెడ్డిని గెలిపిస్తే కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యారంగ సమస్యలపై చట్టసభల్లో నోరు విప్పలేదని విమర్శలు వస్తున్నాయి. మళ్లీ ప్రైవేట్ విద్యాసంస్థ అధిపతులకే అవకాశం ఇస్తే పరిస్థితి ఏంటని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఆ స్థానాలకు విపరీతమైన పోటీ
కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు మాత్రం ఆశావహుల పోటీ విపరీతంగా ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మెదక్ జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రఘునాథరావుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌రావు ప్రధాన రేసులో ఉన్నారు. గోదావరి అంజిరెడ్డి, రఘునాథరావు ఈ సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
రేసులో ఉన్నవారి పలుకుబడి, ఆర్థిక స్థితిగతులను అంచనా వేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి గత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మామిడి సుధాకర్‌రెడ్డితో పాటు విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఎమ్మెల్సీ టికెట్లు మరోసారి కార్పొరేట్ విద్యాసంస్థలకు చెందిన వారికే కేటాయిస్తే పార్టీపై విమర్శలు వచ్చే అవకాశముందని శ్రేణులు భావిస్తున్నాయి.
మూడు స్థానాలపై కమలనాథుల గురి
లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటాలాని భావిస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలపై కమలనాథులు కన్నేశారు. తెలంగాణలో వచ్చే ఏడాది మార్చి నాటికి మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో రెండు టీచర్, ఒకటి గ్రాడ్యుయేట్ స్థానాలు ఉన్నాయి. వాటి కోసం ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు కాగా.. వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికీ ఎన్నిక జరగాల్సి ఉంది.
కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ జిల్లాల్లో తమకు గట్టి పట్టుందని.. ఆ రెండు సీట్లలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ పక్కా ప్లాన్ ఇప్పటి నుంచే వేస్తోంది. పట్టున్న చోట 10 మందికిపైగా ఆశావహులు ఉంటే.. వరంగల్-ఖమ్మం-నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ టికెట్‌కు మాత్రం పోటీ పెద్దగా లేకపోవడం గమనార్హం. ఈ స్థానం కోసం ఉపాధ్యాయ సంఘం లీడర్‌గా పని చేసిన వ్యక్తితో పాటు సంఘ్ పరివార్‌కు చెందిన మరో టీచర్ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సర్వోత్తమ్‌రెడ్డి, సంఘ్ పరివార్‌కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు రచిస్తున్న వ్యూహాలు ఫలిస్తాయా? లేదా? అన్నది చూడాలి.