జాబ్ క్యాలెండర్ ప్రకారమే.. ఉద్యోగాల భర్తీ.! టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి

by Geesa Chandu |   ( Updated:2024-08-16 15:09:17.0  )
జాబ్ క్యాలెండర్ ప్రకారమే.. ఉద్యోగాల భర్తీ.! టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ లో ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లో పొందుపరచిన షెడ్యూల్ ప్రకారమే భర్తీ చేయనున్నట్లు, ఈ భర్తీలో ఎలాంటి మార్పు లేదనీ.. టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం (ఆగస్టు 15) స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంలో మహేందర్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదనీ.. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపడతామని అన్నారు. అయితే ఇప్పటికే తెలంగాణాలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ లు, పరీక్షల తేదీల వివరాలతో షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 20 రకాల ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ వివరాలను ఇందులో పొందుపరిచింది. కాగా తాజా జాబ్ క్యాలెండర్ ప్రకారం.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 21 నుంచి 27 వరకు, గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 17 నుంచి 18 వరకు, అలాగే ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని, దీంతో పాటు వివిధ పరీక్షలకు కూడా తేదీలను విడుదలను చేసిన సంగతి తెలిసిందే. ఈ అన్ని పరీక్షలకు సంబంధించిన వివరాలు తెలియాలంటే మాత్రం మీరు అధికారిక వెబ్ సైట్ ను చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed