- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కర్ణాటక ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు ఝలక్ తప్పదా..? షాకిస్తోన్న జాతీయ లీడర్స్ మీటింగ్!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మోడల్ నినాదంతో దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీని యాక్టివ్ చేయాలని సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు కండువాలు కప్పి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయం కాక రేపుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ప్రతి పక్ష పార్టీలతో పాట్నాలో సమావేశం నిర్వహించాలని జేడీయూ చీఫ్ భావిస్తున్నారు.
అయితే ప్రతిపక్షాలన్నీ ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే మే 13న కర్ణాటకలో ఫలితాలు తేలనున్నాయి. అయితే ఇటీవల నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ తో కలిసి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం పాల్గొన్నారు. ప్రతిపక్షాల ఐక్యతే లక్ష్యంగా ఈ మీటింగ్ సాగింది. అయితే ప్రతిపక్షాల సమావేశంలో సీనియర్ నేత లాలూ ప్రసాద్ కీలకంగా వ్యవహరించనున్నట్లు తెలిసింది.
కేసీఆర్‌కు షాక్ ఇవ్వనున్నారా..?
అయితే ప్రతిపక్షాల పార్టీలను లీడ్ చేసే సత్తా కేసీఆర్‌కే ఉందని ఆ పార్టీ నేతలంటున్న వేళ తాజా పరిణామాలు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఓ వైపు జాతీయ కూటమి నాయకులు కేసీఆర్ లేకుండానే మీటింగ్‌కు ఏర్పాటు చేసుకుంటుండంతో ఏం జరగబోతోందోననే ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేసి దేశవ్యాప్తంగా సత్తా చాటాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. జాతీయ పార్టీ అని ఇప్పటికే ఆయా పార్టీల సీఎంలను, మాజీ సీఎంలను మచ్చిక చేసుకున్న గులాబీ బాస్‌కు ఆయా రాష్ట్రాల సీఎంలు దూరంగా ఉంటున్నరనే టాక్ ఉంది. అందుకే ఇటీవల జరిగిన సచివాలయం ఓపెనింగ్‌కు ఎవరిని పిలవలేదని ప్రచారం సాగుతుంది.
బీజేపీ టార్గెట్‌గా జాతీయ రాజకీయాల్లో రాణించాలని ఓ వైపు కేసీఆర్ ప్రయత్నిస్తుండగా.. బీహార్ సీఎం నితీష్ కుమార్ తాజా నిర్ణయంతో మళ్లీ ఆ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. సౌత్ టార్గెట్‌గా బీజేపీ ఓ వైపు పావులు కదుపుతుండగా.. మరో వైపు నితీష్ కుమార్ ప్రయత్నాలతో ప్రతిపక్ష కూటమిలో సైతం అయోమయం నెలకొంది. ప్రధాని అభ్యర్థిత్వానికి రాహుల్ గాంధీ ఓకే అని చెప్పినా.. నితీష్ కుమార్ వ్యూహంపై ఉత్కంఠ నెలకొంది. నితీష్ కుమార్ దూకుడుతో ఆయనే ప్రధాని పీఠంపై కన్నేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరితో ఎవరు జట్టు కడతారనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..